calender_icon.png 19 November, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌భవన్‌లో ఎట్ హోం

16-08-2024 01:02:11 AM

గవర్నర్ తేనీటి విందు

హాజరైన మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, మంత్రులు

కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నేతల డుమ్మా

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాజ్‌భవన్‌లో తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య భేదాభిప్రాయాల కారణం గా ఎట్‌హోంకు గైర్హాజరు అయ్యేవారు.

ఈ నేపథ్యంలో ఈసారి కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించారు. ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ఆహ్వానించినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మె ల్సీ రమణ మినహా మిగిలిన ఎవరూ రాలేదు. బీజేపీ నుంచి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే  వెంకటరమణారెడ్డి మాత్రమే వచ్చారు. ఎట్‌హోంకు హాజరైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా మాట్లాడారు. హైకోర్టు జడ్జీలు జస్టిస్ సురేపల్లినందా, జస్టిస్ గిరిజా ప్రియదర్శిని, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.