calender_icon.png 8 July, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలపై అప్రమత్తంగా ఉండాలి

08-07-2025 05:23:49 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): రానున్న వర్షాకాలంలో వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ప్రసాద్(Tahsildar Prasad) సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఏ ఇబ్బంది కలిగినా ప్రజలు వెంటనే సిబ్బందికి తెలియజేయాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. వరదల పట్ల పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఎస్ఐ నాగబిక్షం, ఎంపీఓ బాలయ్య, ప్రాథమిక వైద్యురాలు లక్ష్మి సాహితీ, ఏంఈఓ యదు సింహరాజు, వెటర్నరీ డాక్టర్ రాజేందర్, విద్యుత్ శాఖ ఏఈ ఉపేందర్, సబ్ ఇంజనీర్ రామకృష్ణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రషీద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.