08-07-2025 08:30:31 PM
ఏపీఎం లక్ష్మీ దుర్గ..
వాజేడు (విజయక్రాంతి): మండలంలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని వాజేడు మండల సెర్ప్ ఏపీఎం లక్ష్మీ దుర్గ(SERP APM Lakshmi Durga) అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి అనేకమంది మహిళలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాజేడు మండల సమాఖ్య అధ్యక్షురాలు కుర్సం నాగమణి అధ్యక్షత వహించగా మండల సీసీలు, వివోఏలు, మహిళా సంఘాల లీడర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ఏపీఎం లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ... ఇందిరా మహిళా శక్తి ఉద్దేశం లక్ష్యాలు, సంఘాలను బలోపేతం చేయడం, ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ ఆధారిత జీవనోపాదులు, వ్యవసాయేతర జీవనోపాదులు, మానవ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మహిళా శక్తి సంఘాలు సాధించిన విజయాలపై చర్చించారు.
అందులో భాగంగా గత సంవత్సరం సాధించిన ప్రగతి బ్యాంకు లింకేజీ రుణాలు 150 సంఘాలకు గాను 868.77 లక్షల ఋణాలు ఇవ్వగలిగామని తెలియజేశారు. వడ్డీ లేని ఋణాలు వడ్డీ రాయితీ క్రింద 335 సంఘాలకు 39. 99 లక్షలు చేయించమన్నారు. క్రొత్త ఎంటర్ప్రైజెస్ 251 మందికి 251 లక్షల రుణాలు ఇవ్వగలిగామన్నారు. వ్యవసాయేతర రుణాలలో భాగంగా 177 మందికి 177 లక్షలు క్రొత్తగా 74 మందికి 74 లక్షలు మంజూరు చేయగలిగామన్నారు. మండలంలో 541 సంఘాలు ఉండగా క్రొత్తగా 15 సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల 159 లబ్ధిదారులకు ఒక కోటి 13 లక్షలు ప్రపోజల్ తయారుచేసి 99 మందికి గాను 58 లక్షల 70 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండలంలో మహిళా సంఘాలలో నిరంతరం అప్పులు ఇవ్వడం అదేవిధంగా రీపేమెంట్ చేయగలిగితే ఇంకా అనేకమందికి ఆర్థిక చేయూతను అందజేయవచ్చని తెలిపారు.
65 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులను గుర్తించి వారికి ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యాభ్యాసం మధ్యలో ఆపేసిన వారితో సంఘాలు నేర్పడే చేసి వారికి సరైన వృత్తిని నైపుణ్యాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూతను అందించాలన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సిబ్బందితో సాధ్యమైనంతవరకు కొత్త సంఘాల ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతకై ప్రాణాలికలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు హాజరై మాట్లాడుతూ మహిళా సంఘాలు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సతీష్ హాజరై మాట్లాడుతూ, ఎంటర్ప్రైజెస్ అభివృద్ధికై ఎంతైనా ఋణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 41 గ్రామ సంఘాల ప్రతినిధులు, వివో ఏలు, సీసీలు మల్లాచారి, శంకరమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.