calender_icon.png 9 July, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ పారీశ్రామికులుగా ఎదగాలి

08-07-2025 08:24:13 PM

సీజీటీ ఎంఎస్సీ అవగాహన సదస్సులో ఎంఎస్ఇ డీజీఎం ఎస్ ఆర్కే మూర్తి పిలుపు..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ఆదేశాల మేరకు క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అవగాహన సదస్సు కరీంనగర్ లో కిసాన్ నగర్ లోని కెఎం కన్వేన్షన్ లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అమలు చేస్తుందని ఎంఎస్ఈడిజీఎంఎస్ ముంబాయికి చెందిన ఆర్ కే మూర్తి అన్నారు. ఈ పథకం కింద రూపాయలు లక్ష నుండి మొదలు 10 కోట్ల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు అందించేలా ప్రధాని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని వివరించారు.

ఆసక్తిగల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన కోరారు. ఎంతో లాభదాయకమైన వ్యాపార యూనిట్లను నెలకొల్పి పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే శక్తిగా ఈ పథకం ఉంటుందని ఆయన అన్నారు. ఈ అవగాహన సదస్సులో ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అంజనేయులు, అన్ని  బ్యాంకుల ఏడీలు కరీంనగర్ జిల్లా పరిశ్రమల అధకారి జయంతి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజేస్ మేనేజర్ దేవేందర్, అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఎన్ జీ ఓ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మస్తాన్ ఖాన్, మాజీ  కార్పోరేటర్ కుర్ర తిరుపతి, కంసాల శ్రీ స్మాల్ నివాస్  తదితరులు పాల్గొన్నారు.