calender_icon.png 9 July, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కెలా గ్రామంలో ప్రభుత్వ భూమి పరిశీలన

08-07-2025 08:50:35 PM

ఏటూరునాగారంలో వెజ్ నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన..

వన సంరక్షణ సమితి ఏర్పాటుపై రైతులకు అవగాహన..

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్(District Collector Divakara TS), అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector Revenue CH Mahenderji)తో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గోదావరి నది ప్రవాహ ప్రాంతం భూటారం ముంపు ప్రాంత గ్రామస్తులకు నివాస స్థలం కేటాయించుటకు స్థల పరిశీలన చేసి పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత తహసిల్దారును ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపన ఉన్న ఫారెస్ట్ నర్సరీ ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

ఏటూరునాగారంలో వెజ్ నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు కొరకు ల్యాండ్ సర్వే చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్ తో కలిసి చిన్నబోయినపల్లి సర్వే నెంబర్.98 అటవీ భూ సాగుదారులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి వీలు లేనందున అటవి సంరక్షణ సమితి ఏర్పాటు వలన కలుగు లాభాలను 70మంది రైతులకు వివరించారు.