08-07-2025 08:38:09 PM
వాజేడు (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్(MRPS) సంఘానికి సంబంధం లేకున్నా సంఘాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న అరికెళ్ల వేణు, బలుసుపాటి రాజు, చెన్నం ఎల్లయ్యలను సంఘం నుండి వెలివేస్తున్నామని, వీరు సంఘం పేరుతో ఏ కార్యక్రమాలు చేసిన ఎమ్మార్పీఎస్ కు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా ఇన్చార్జి చాతల రమేష్ మాదిగ మంగళవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ వాజేడు మండల కమిటీ, ఎంఎస్పి కమిటీ ఆదేశాల మేరకు వీరు ఇతర రాజకీయ పార్టీలో ఉంటూ ఎమ్మార్పీఎస్ పేరుతో సంఘాన్ని తప్పుదారి పట్టిస్తూ అవమానపరుస్తూ, సంఘాన్ని బ్రష్టు పట్టించే ప్రయత్నం కొనసాగిస్తున్నారని అన్నారు.
పేరూరు గ్రామానికి చెందిన అరికెళ్ల వేణు, ధర్మవరం గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ బలుసు పాటి రాజు, కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న చెన్నై ఎల్లయ్య లకు ఎమ్మార్పీఎస్ తో ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. వీరిలో ఎవరైనా ఎమ్మార్పీఎస్ పేరుతో వస్తే మండల ప్రజలు సహకరించవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెన్నం స్వామి, ఎంఎస్పి మండల అధ్యక్షులు పేట సమ్మయ్య, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి చిట్యాల రాకేష్, కార్యదర్శి కీసరి రాజు మాదిగ, సహాయ కార్యదర్శి మాడుగుల జ్యోతి, ప్రచార కార్యదర్శి తిప్పనపల్లి భాను మాదిగ లు పాల్గొన్నారు.