calender_icon.png 9 July, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబాపై పోలీసుల ఉక్కు పాదం

08-07-2025 08:46:48 PM

గుడుంబా కోసం ఆసరా బుక్ తాకట్టు అనే కథనానికి పోలీసుల స్పందన

గుడుంబా మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు.

కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా డాక్టర్ ఎస్పీ శబరిష్(District SP Shabarish) అదేశాల మేరకు, కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్(SI Venkatesh) అధ్వర్యంలో గుడుంబా నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు పూర్తి విరుద్ధమని అందులో ఆరోగ్యానికి హాని చేసే యూరియా, మురికి నీరు పటిక బెల్లం వాడడం వలన ఆరోగ్యానికి విపరీతమైన హాని చేస్తుందని, తాగే వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. 

కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం పాలసీకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో రహస్యంగా ఇండ్ల వద్ద, పంట పొలాల వద్ద, అటవీ ప్రాంతంలలో కలుషిత నాటుసారా తయారు చేస్తూ విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారనీ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామాలలోకి కిరాణా దుకాణాలతో పాటు గుడుంబా అమ్మే ప్రాంతాలకు సరఫారా చేసే వారికి ఫీడియాక్ట్ చేసులు చేస్తామని అన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని త్వరలో వారిని కూడా పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.