08-07-2025 08:40:54 PM
కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్ రాజ్ మహమ్మద్...
చిట్యాల (విజయక్రాంతి): మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని కాకతీయ హైస్కూల్ కరస్పాండెంట్ రాజ్ మహమ్మద్(Kakatiya High School Correspondent Raj Mohammed) అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకొని భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే విధంగా కృషి చేయాలని కోరారు. విద్యార్థులు ఇంటి ఆవరణంలో కనీసం ఒక మొక్కను నాటే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.