08-07-2025 09:03:32 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... ఈనెల 13న ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించబోతున్నామని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహతో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొంటారని అన్నారు. అనంతరం దండేపల్లి మండలంలో పర్యటన చేసి తాళ్లపెట్ లో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున మంత్రులు పాల్గొని ప్రభుత్వం ఆసుపత్రిని 13వ తేదీన ఉదయం 11:30 నిమిషాలకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,పూర్ణ చందర్రావు, మాజీ కౌన్సలర్ లౌడియ సురేష్ నాయక్, రాందేని వెంకటేష్, యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, బొప్పూ సుమన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, అమీర్,హాజీ, శ్రీధర్, పెట్టం శ్రీనివాస్, నవాబ్, రమేష్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.