01-11-2025 03:30:04 PM
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): క్షయ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇంచార్జి వైద్యాధికారి కె.రవికుమార్ అన్నారు. శనివారం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దముద్దునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనపట్ల గ్రామంలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. క్షయ అనుమానితులను గుర్తించి, పరీక్షించి, సరైన చికిత్స అందించడం ద్వారా మాత్రమే టీబీని అంతం చేయగలమన్నారు. గ్రామ స్థాయిలో శిబిరాలు నిర్వహించినప్పుడు అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక బృందాలు, ఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు చురుకుగా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. వనపట్ల, చందుబట్ల గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహించగా వనపట్లలో 107 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేశారు.