01-11-2025 03:23:55 PM
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మద్యం టెండర్ల లో పాల్గొన్న ఉపాధ్యాయులు విషయం ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చర్చిని అంశమైన విషయం విధితమే. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా, జిహెచ్ఎస్ రాంనగర్, పిఇటి బి పుష్ప మద్యం షాపులకు సంబంధించి టెండర్ లో పాల్గొన్నారు. అనూహ్యంగా ఉపాధ్యాయురాలు బి పుష్పకు షాపు లక్కి డిప్ లో ఖరారు అయిన విషయం తెలిసిందే.
సీసీఏ రూల్స్ 1991లోని సబ్-రూల్ 8(1)(a) కింద ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ నిబంధనలను పాటించలేదని ఉపాధ్యాయురాలు బి పుష్ప, క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకు ఆమె సస్పెన్షన్‌లో కొనసాగుతారని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఈ షాప్ కు సంబంధించి మరోసారి లక్కీ డిప్ తీసే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.