01-11-2025 03:32:46 PM
తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు మద్దిరాల మండల పరిధిలోని చిన్ననేమీల గ్రామం లో ఆగ్రోఫెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సన్న రకాలకు అదనంగా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగాపని చేస్తుందని అన్నారు.