calender_icon.png 12 December, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారంలోని ఏ కాలనీని తార్నాకలో విలీనం చేయొద్దు

12-12-2025 06:01:30 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ నాచారం డివిజన్లో ఉన్న కొన్ని కాలనీలను  తార్నాక డివిజన్లో కి విలీనం చేయవద్దు అంటూ   గ్రేటర్ హైదరాబాద్ బి ఆర్ ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్ జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన అభ్యంతరాల డెస్క్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ ను 300 డివిజన్లుగా విభజన ప్రక్రియ నేపథ్యంలో నాచారం డివిజన్ ను మెయిన్ రోడ్డు ఒకవైపు  హెచ్ఎంటి నగర్ కాలనీ మరోవైపుగా డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇందులో హెచ్ఎంటి నగర్ కాలనీ డివిజన్ పాత నాచారం హద్దులు ఉండడం ద్వారా ఇలాంటి ఇబ్బంది  లేదని, కానీ పాత నాచారం డివిజన్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలు తార్నాక డివిజన్ వెళ్లినట్లు  తెలుస్తుందని  అట్టికాలనిలను తార్నాక డివిజన్లో  కల్పకుండా పాత  నాచారం డివిజన్లోనే ఉంచాలని  అధికారుల ను ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి తో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్  ఈ విషయం నీ దృష్టికి తీసుకొని వచ్చామని ఆయన కూడా  సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.