calender_icon.png 12 December, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ మండలంలో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

12-12-2025 05:51:48 PM

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ మండలంలోని జగన్నాధపురం, రంగాపురం పంచాయతీలలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి మాజీ మంత్రి కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు శుక్రవారం విస్తృత పర్యటించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేశానని నేను చేసిన పనులే బిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తోడ్పాటు అందించాలన్నారు.

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని వనమా అన్నారు. 10 సంవత్సరాల కెసిఆర్ పరిపాలన స్వర్ణ యుగం  అన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో తొక్కిందన్నారు, కేసీఆర్ హయాంలో పంచాయితీలు సస్యశ్యామలంగా ఉన్నాయని అన్నారు ప్రతి పంచాయతీలో మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి వ్యక్తి కెసిఆర్ మాత్రమే అన్నారు.

అక్కడ కేసీఆర్ ఇక్కడ నేను కలిసి కొత్తగూడెం నియోజకవర్గంలో వేలకోట్లతో అభివృద్ధి పరచామన్నారు. పాండురంగాపురం బ్రిడ్జి, దంతలబోరు బ్రిడ్జి, యానం బైలు వద్ద బ్రిడ్జి, పెటచెరవు వద్ద బ్రిడ్జి, పెనుబల్లి వద్ద బ్రిడ్జి, సుజాతనగర్ వద్ద బ్రిడ్జి నా హయాంలోనే కట్టించానన్నారు. జగన్నాధపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ధర్మ సోత్రం రమేష్ ను, రంగాపురం శ్రీను భార్యను గెలిపించాలని వనమా కోరారు.