16-09-2025 07:11:17 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఫైబర్ నేరాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఇతరులకు అవగాహన పెంపొందించే విధంగా కృషి చేయాలని మహబూబాబాద్ పట్టణ సిఐ మహేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యంగా విద్యాభ్యాసం చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.బలరాం నాయక్, ఎస్ ఐ అశోక్, భవాని, అధ్యాపకులు పాల్గొన్నారు.