calender_icon.png 12 July, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

12-07-2025 01:21:03 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, జూలై 11 (విజయక్రాంతి) : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం బాలెంల పల్లె దవాఖాన ను  తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలను  ప్రోత్సహించాలని సూచించారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలన్నారు.రక్త హీనతతో భాధపడుతున్న పేషెంట్స్ ఎంత మంది ఉన్నారు వాళ్ళ చికిత్స  గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ ఆవరణలోని వాటర్ ట్యాంక్ ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా క్లీన్ చేయాల్సిందిగా గ్రామ కార్యదర్శిని అదేశించారు. వ్యాధి నిరోధక టీకాలు వేసే రోజు పేషెంట్స్ వచ్చినపుడు కూర్చోడానికి కూడా వీలు ఉండట్లేదు అని డాక్టర్ చెప్పగా  వెంటనే వెయిటింగ్ షెడ్ నిర్మించాలని గ్రామ కార్యదర్శిని అదేశించారు .

ఇట్టి నివేదికను రెండు రోజులలో ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి బాలెంల  ప్రాధమిక పాఠశాల సందర్శించి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి  తెలుగు, ఇంగ్లిష్ భాష లలో పట్టు సాధించాలని సూచించారు. గ్రామంలోని అంగన్వాడి కేంద్రంను సందర్శించి పలు విషయాలపై ఆరా తీసి సూచనలు చేశారు. ఈయన వెంట మెడికల్ అధికారి  మణిరత్నం, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నీరజలత, ఉపాధ్యాయులు రేణుక,  ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ నాగమ్మ, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరాజులు ఉన్నారు.