12-07-2025 01:22:18 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణలో త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు నియామకం సరికాదని, ఆయనకు పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్ఠానం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.
‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల హత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇవ్వడమేంటీ? దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి, రోహిత్ వేముల కేసులో ఎవరినీ వదిలిపెట్టం’ అని డిప్యూ టీ సీఎం హెచ్చరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభా గం చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
‘హెచ్‌సీయూలో ఏబీవీపీ, ఏఎస్‌ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రాంచందర్‌రావు అక్కడికి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చా రు. రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బల హీనవర్గాలపై దాడులు పెరిగాయి.
రోహిత్ వేముల కేసును మళ్లీ విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించాం. ప్రతి ఒక్క రికీ దేశంలో బతికే హక్కు ఉంది, వివక్ష ఉండకూడదు’ అని భట్టి అన్నారు. ‘హెచ్‌సీయూలో చేరిన దళిత విద్యార్థులకు అడ్మిషన్‌తో పాటు తాడు కూడా ఇవ్వాలి. వారు ఉరివేసుకోవడానికి దాన్ని ఉపయోగించ్చు’ అని రోహిత్ తన నోటులో రాసుకున్నారని, ఇది ఎంతో హృదయ విదారకమని ఆయన పేర్కొన్నారు. రోహి త్ వేముల ఒక తెలివైన యువకుడని, అతను పీహెచ్‌డీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని తెలిపారు.
దళిత విద్యార్థుల ప్రాథమిక హక్కులు, గౌరవాన్ని కోరుతూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో సుశీల్‌కుమార్, రోహిత్ మరో నలుగురు వీసీకి మెమోరాండం ఇస్తే దాన్ని ఏబీవీపీ జీర్ణించుకోలేదని, జాతి వ్యతిరేకులుగా పేర్కొం టూ వీసీకి ఫిర్యాదు చేశారని భట్టి గుర్తు చేశారు. ఈ ఐదుగురు విద్యార్థులపై కేసు లు నమోదు చేయాలని బీజేపీ నేత రాం చందర్‌రావు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ ఒత్తిడిని తట్టులేకనే రోహిత్, మిగతా నలుగురిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారని ఆయన వివరించారు.
పవర్ షేరింగ్ ఉండదు..
కర్ణాటక తరహాలో తెలంగాణ రాష్ట్రం లో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందరం కలిసి టీమ్ వర్క్‌గా పనిచేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహిం చారు. బీఆర్‌ఎస్ నేతల మాటలు మితిమీరి పోయాయని మండిపడ్డారు. కేసీ ఆర్ అసెంబ్లీకి రావడం లేదని, జనాల్లోకి వెళ్లడం లేదని విమర్శించారు.
రూ. 2 లక్షల దాటిన రైతులకు రుణమాఫీ చేయవద్దని తమ ప్రభుత్వ విధాన నిర్ణయమని, రేషన్‌కార్డు ఆ ధారంగానే రుణమాఫీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం సక్సెస్ అయిందని, గతంలా రేషన్ బియ్యం పక్క దారి పట్టడం లేదని విక్రమార్క తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పం దన ఉందని, మరో 3 వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ ఈ ప్ర భుత్వంలోనే పూర్తవుతుందన్నారు. గాంధీఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందని, దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నా యని భట్టి చెప్పారు. రీజినల్ రింగ్‌రోడ్డు కూడా వస్తుందన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వ చ్చే అవకాశం లేదని చెప్పారు. సిగా చి ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పీ ఏసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు.