23-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి) : అందాల పోటీల్లో స్త్రీలను విలాస వస్తువుగా చూపిస్తున్నారని ప్రముఖ రచయిత్రి విమల పేర్కొన్నారు. దీనిని ఎవరు వ్యతిరేకించకపోవడం బాధాకరం అన్నారు. కోట్ల మంది యువతులు ఉండగా ముగ్గురే ప్రపంచ సుందరీమణులుగా ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. స్త్రీలను దేహంగా చూపించే అందాల పోటీలను ప్రతి ఒక్కరూ గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి పోటీలను మహిళలే కాదు పురుషులు కూడా భాగస్వాములై ధర్నాలు, రాస్తారోకోలు చేసి అడ్డుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ’అందాల పోటీలు-వ్యాపార సంస్కృ తి’ అనే అంశంపై సామాజిక సదస్సును మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు కె.రంగాచారి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సదస్సుకు ప్రధాన వక్తగా కవయిత్రి విమల హాజరై మాట్లాడుతూ ఒకవైపు రైతులు, విద్యార్థులు, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని పంచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు పీడేల్ వాయించిన చందంగా సీఎం దేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ ప్రజాస్వామిక వాతావరణం నెల కొందని విమర్శించారు.
కార్పొరేట్ శక్తుల వ్యాపారంలో భాగమే ఈ అందాల పోటీలకు విమర్శించారు. తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ అధ్యక్ష్యులు నం దిని సిధారెడ్డి మాట్లాడుతూ స్త్రీని అంగడి వస్తువుగా మారుస్తున్న వ్యాపార ప్రపంచంలో ఈ అందాల పోటీలు నిర్వహిస్తుం దని, దీనికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించాలన్నారు.
తెలంగాణ అంటే ఒక పోరాటాల శక్తి అని అందాల పోటీలు జరుగుతున్నా ఆ పోరాట పటిమ కనిపించడం లేదన్నారు. ఈ సదస్సులో ప్రముఖ రచయిత, మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రచయిత్రి ఆర్ పద్మజ, అరుణ తదితరులు పాల్గొన్నారు.