23-05-2025 12:00:00 AM
ఆమనగల్ మే 22 : ఆధునీక సాంకేతికతను అందిపుచ్చుకొని పంటలు సాగు చేసే విధానం గురించి రైతులకు పలువురు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. గురు వారం మండలంలోని చింతలపల్లి గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందిన శాస్త్రవేత్తలు నిర్మల డాక్టర్ సూచిరితాదేవి, వ్యవసాయ కళాశాల విద్యార్థి స్వప్నశ్రీ,వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవ ఎరువుల వినియోగం తగిన మోతాదులో మందుల పిచికారి,పంట మార్పిడి విధానం, సేంద్రీ య ఎరువుల వాడకం, భూసారం పెంపుదల, యూరియా విరివిరిగా వాడ టం వల్ల కలిగే నష్టాలు, భూసారం ప్రతికూల ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట మార్పిడి విధానం పాటించాలని... అప్పుడే పంటలు దిగుబడి వచ్చి రైతులకు ఆర్థికంగా లబ్ధి కలుగుతుందన్నారు.
మట్టి పరీ క్షలు జరిపి వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం పంటలను సాగు చేయాలని, సాంప్రదాయ పంటలతో పాటు కూరగాయల సాగు,మెట్ట పంటలు యాంత్రిక వ్యవసాయ విధానం, డ్రిప్ సిస్టం ద్వారా పంటల సాగు గురించి రైతులకు వివరించారు. కంది, మొక్కజొన్న, శనగల పంటలను సాగు చేస్తే రైతులు లాభాలు గడించవచ్చని వారు పేర్కొన్నారు.