23-05-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, మే 22: నడుస్తున్న బస్ డ్రైవర్ పై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడికి తెగబడ్డ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ బస్ కాచిగూడ నుంచి పటాన్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. తన ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ బస్సు ను ఆపి డ్రైవర్ ఫోన్ లాక్కొని ఆటో డ్రైవర్ దాడికి యత్నించాడు.
రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు డ్రైవ్ చేయనివ్వకుండా చెయ్యి పట్టుకుని ఆటో డ్రైవర్ తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సులో ప్రయాణికులు ఉన్నారని కనీసం ఇంగి త జ్ఞానం కూడా లేకుండా ఆటో డ్రైవర్ ప్రవర్తించడంపై వీడియో చూసిన నెటిజన్లు మండిపడ్డారు. బస్సులోని ప్ర యాణికుల చొరవతో వివాదం సద్దుమణిగింది.
డ్యూటీలోని ఉన్న ఆర్టీసీ ఉద్యో గులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని ఆయ న చెప్పారు.
ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థై ర్యాన్ని దెబ్బతిసే విధంగా.. మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీజీఆర్టీసీ ఏ మాత్రం సహించబోదని వివరించారు. నిందితులపై చట్టప్రకారం శిక్షిస్తామని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.