calender_icon.png 7 October, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్‌లో జోరుగా బెల్ట్ షాపుల దందా

07-10-2025 12:00:00 AM

చోద్యం చూస్తున్న అధికారులు

చేగుంట, అక్టోబర్ 5: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా మూడు పు వ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. వ డ్డించేవాడు మనవాడైతే అన్న చందంగా ఎక్సైజ్ అధికారుల అండదండలతో గ్రామా ల్లో బెల్ట్ షాపుల దందా యదేచ్ఛగా కొనసాగుతోంది. చేగుంట మండలంలో అడిగేవా డు లేడు అన్న ధీమాతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిగా మద్యం అమ్మకాలు చే పడుతున్నారు.

స్థానిక ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న గ్రామాలలో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బెల్టు దందా నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు అందజేస్తుండడంతో అం దుకు తగ్గట్టుగా అధికారులు వ్యవహరించ డం గమనార్హం. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

చేగుంట మండలం లో 25 గ్రామ పంచాయతీలు ఉండగా ఒ క్కొక్క గ్రామ పంచాయతీ లో బెల్ట్ దుకాణా లు 10 నుండి 15 వరకు ఉన్నాయి. ప్రధానంగా కిరాణా కొట్టులో, హోటళ్లలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.  ఒక్క మందు బాటిల్ మీద 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేగుంట మండలం కర్నాలపల్లి ఎ ల్లమ్మ దేవాలయం వద్ద దుకాణాలలో మ ద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

అయినప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు కనీసం తనిఖీలు చేసిన పాపాన పోవడం లేదు. ఎల్లమ్మ దేవాలయం వద్ద భక్తులు చా లా దూర ప్రాంతాల నుండి మొక్కులు చెల్లించడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ల భించే మద్యం తాగి చాలా మంది రోడ్డు ప్ర మాదాల్లో చనిపోయిన సంఘటనలు ఉన్నా యి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్ట్ దుకాణాల పైన ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.