calender_icon.png 28 January, 2026 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణత అభియాన్‌లోని అంశాలపై పురోగతి సాధించాలి

28-01-2026 06:37:41 PM

నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్ -2.0 లోని అంశాల పై పురోగతి సాదించాలని నీతి అయేగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం అన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయము నుండి దేశంలోని  112  జిల్లాలు, 513 బ్లాక్‌లలోని నీతి అయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సంపూర్ణత అభియాన్–2.0 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 14 వరకు బ్లాక్ కార్యక్రమాలోని అంశాల పై జిల్లా, బ్లాక్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల విస్తరణ వంటి అంశాలపై పకడ్బందీగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములుగా చేయాలన్నారు .కల్లెక్టరేట్ లోని  వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. 

ఈ సందర్బగంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంపూర్ణత అభియాన్–2.0లో భాగంగా తిర్యాణి బ్లాక్ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో  సమావేశం నిర్వహించి, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం శాఖ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ శాఖలోని అంశాల పురోగతి పై  దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.

సంపూర్ణత అభియాన్–2.0 కార్యక్రమాన్ని జనవరి 28 నుండి ఏప్రిల్ 14 వరకు అకాంక్షిత బ్లాక్ ఆకాక్షింత  జిల్లా కార్యక్రమాలను  పకడ్బ్బందిగా చేపడతామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను  భాగస్వామ్యం చేసి  లక్ష్యాలను సదిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో   శిశు  సంక్షేమ శాఖ  అధికారి ఆడెపు  భాస్కర్, డిపిఎం  రామకృష్ణ, సంపూర్ణ అభియాన్ జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.