calender_icon.png 25 October, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ యువత భవితకు ‘ఉత్తమ’ భరోసా

25-10-2025 01:30:52 AM

  1. 250కి పైగా కంపెనీలలో వేల మందికి ఉద్యోగావకాశాలు
  2. ఉద్యోగ మేళాపై ఉమ్మడి నల్లగొండలో విస్తృత ప్రచారం
  3. నేడు హుజూర్‌నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మేళా

సూర్యాపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి): గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ల సహకా రంతో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నారు.

శనివారం హుజూర్‌నగర్‌లో జరుగ నున్న మెగా జాబ్ మేళాలో 250కి పైగా వివిధ కంపెనీలు పాల్గొననున్నాయి. దీనిలో ఐటి, ఇంజనీరింగ్, హెల్త్, తయారీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మసీ, సేల్స్ అండ్ మార్కెటింగ్, వ్యవసాయ, రసాయన రంగ, ఇన్సూరెన్స్, ఎయిర్ పోర్ట్ సర్వీస్, స్కిల్ ట్రైనింగ్ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు నుండి ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ ప్రత్యక్షంగా కంపెనీలతో మాట్లాడి ఈ మేళాను ఏర్పాటు చేశారు.

నేటి ఉదయం 8 గంటల నుండి నిర్వహించే ఉద్యోగ మేళాపై మంత్రి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ లతో పాటు జిల్లా అధికారులు విస్తృ త ప్రచారం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్‌లో, సూర్యాపేట కలెక్టరేట్ లో ఈ మేళాకు సంబంధించిన పోస్టర్ విడుదల, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ మంది నిరుద్యోగ యువత హాజరుకానున్నారు.

పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉద్యోగమేళా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అలాగే హాజరయ్యే అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భజనం, సాయంత్రం టిఫిన్ లకు సైతం ఇబ్బంది లేకుండా స్వర్ణవేదిక  ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షంలో ఎటువంటి ఆటంకాలు లేకుం డా వాటర్ ప్రూఫ్ టెంట్‌లు వేశారు.             

నిరంతర పర్యవేక్షణలో మంత్రి ఉత్తమ్ 

ఈ మేళాకు శ్రీకారం చుట్టింది మొదలు మంత్రి ఉత్తమ్ ప్రతి అంశం నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎక్కడ, ఎలా నిర్వహించాలనే విషయాలనుండి ఎక్కువ మంది హాజరయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరంగా చర్చిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులకు, ఔత్సాహికులకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు.

గ్రామ స్థాయిలో పనిచేస్తున్న గ్రామ పరిపాలన అధికారులకు, కార్యదర్శులను మేళాను విజయవంతం చేయడంలో భాగస్వాములను చేశారు. దీంతో ప్రారంభంలో మెగా ఉద్యోగ మేళాను ఒక్కరోజే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోగా ఆన్‌లైన్‌లో మేళాకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేష న్లు పెరగడంతో మంత్రి ఉత్తమ్ ఈ మేళాను రెండు రోజులు కొనసాగించేందుకు నిర్ణ యం తీసుకున్నారు. 

మంచి భవిష్యత్తును అందించాలనేదే లక్ష్యం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అన్ని రైతు కుటుంబాలే. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల  నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ.

అందుకే రాజకీయాలకతీతంగా వారికి మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో ఈ మెగా ఉద్యోగమేళాను ఏర్పాటు చేశాం. ఆర్థికంగా బలపడితేనే ఎవరి జీవితాలైనా సంతోషంగా ఉంటాయి కావున ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై దీనిని సద్వినియోగం చేసుకోవాలి.

అందరి సహకారం ఉంటుంది

యువత భవితకు బంగారు బాటలు పరిచేందుకు మంత్రి ఉత్తమ్ ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. గతంలో ఈ జిల్లాలో ఎవ రు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అందు కే దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు ఎటువంటి సందేహం లేదు. మా వం తుగా మేము నిరుద్యోగ యువత ఎక్కువగా హాజరయ్యేందుకు కృషి చేస్తు న్నాం. ఇంత మంచి ఆలోచన చేసిన మంత్రికి కృతజ్ఞతలు.

 జుట్టుకొండ సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్, రాయినిగూడెం, గరిడేపల్లి మండలం