02-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిపోలో ఉత్తమ డ్రైవర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 సంవత్సరాలకు పైగా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న డిపోకు చెందిన డ్రైవర్లు రాజేశ్వరరావు, ఎస్.డి సత్తార్, కె.హరికుమార్ ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, సాయిచరణ్, ఆర్టీసీ డిపో మేనేజర్ కళ్యాణి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రమాదాలకు తావు లేకుండా వాహనాలను నడిపే విధానాలు, డ్రైవర్లు పాటించవలసిన ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ, ఎం.ఎఫ్ పాపిరెడ్డి, ఎడిసిలు, ఆఫీస్, సెక్యూరిటీ, మెకానికల్, సిబ్బంది పాల్గొన్నారు.