calender_icon.png 2 January, 2026 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూప, దీప, నైవేద్యానికి ముస్లిం నేత ఆర్థిక సహాయం

02-01-2026 12:00:00 AM

చేగుంట, జనవరి 1: చేగుంట మండల కేంద్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళి అ మ్మవారికి ధూప, దీప, నైవైద్యానికి చేగుంట పట్టణానికి చెందిన ముస్లిం నాయకులు, పట్టణ ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫిక్ ఆర్ధిక సహాయం అందించారు. తన పదవి ఐదు సంవత్సరాల వరకు ప్రతినెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీ డియా సమావేశంలో తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఉసి కే శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మ వారికి ము స్లిం నాయకులు మొహమ్మద్ రఫిక్ అమ్మవారికి ధూప, దీప, నైవేద్యానికి ఇవ్వడం అనే ది చాలా ఆనందదాయకమని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, గ్రామస్తు లు సోమా సత్యనారాయణ పాల్గొన్నారు.