calender_icon.png 28 January, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడింగ్ కోడర్ పోటీలో ఉత్తమ ప్రదర్శన

28-01-2026 12:00:00 AM

ఆర్విన్ ట్రీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): ట్రిపుల్ ఐటీ మద్రాస్, మెక్మిల్లన్ పబ్లిషర్స్ సంయుక్తంగా నిర్వహించిన ది బడింగ్ కోడర్ పోటీలో ఆర్విన్ ట్రీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సంస్థకు గౌరవాన్ని తెచ్చారు. ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోటీలో దేశవ్యాప్తంగా 350కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో విశేష విజయాన్ని సాధిస్తూ, ఎనుకొండ సాయి భార్గవ్‌రెడ్డి (8వ తరగతి) ద్వితీ య స్థానం (రన్నర్-అప్) సాధించి, తన అసాధారణ కోడింగ్ నైపుణ్యాలు, బలమైన సమ స్య పరిష్కార సామర్థ్యాలను ప్రదర్శించాడు.

ఎనుకొండ రిషిక్‌రెడ్డి తృతీయ స్థానాన్ని సా ధించగా, విద్యాదీప్‌రెడ్డి పోటీలో మూడవ రౌండ్ వరకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా భగవతి ఆర్విన్ ట్రీ హైస్కూల్ చైర్మన్ బి రమణరావు విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, అంకితభావాన్ని ప్రశంసించారు. 8వ తరగతి విద్యార్థులు సాధించిన ఈ విజయాలు కరీంనగర్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.