11-11-2025 12:00:00 AM
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందుకున్న హనుమాన్ రాథోడ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): ఉత్తమ సామాజిక సేవ చేసినందుకుగాను నర్సంపల్లి మాజీ సర్పంచ్ హనుమాన్ రాథోడ్ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతి ఫౌండేషన్, వల్లూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో నర్సంపల్లి మాజీ సర్పంచ్, మానస క్యాటరర్స్ ఫౌండర్ హనుమాన్ రాథోడ్‌ను ఉత్తమ అవార్డుతో ఘనం గా సత్కరించి గౌరవించారు.
ఈ అవార్డును హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దైవాజ్ఞ శర్మ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య, ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసులు చేతులమీదుగా ప్రధానం చేశారు. ఈ అవా ర్డు దక్కడం పట్ల హనుమాన్ రాథోడ్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇటువంటి కార్య క్రమా లు నిర్వహించి సేవ సేవకులను గుర్తించి వారికి అభినందిస్తూ అవార్డుతో ప్రోత్సహించినందుకు ప్రగతి ఫౌండేషన్, వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసులుకు ధన్యవాదాలు తెలియజేశారు.