calender_icon.png 20 September, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లా ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

20-09-2025 07:48:35 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి  ప్రతీకైనా  బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు అన్నారు. బతుకమ్మ పండుగా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు అడపచులు అందరూ కల్సి ఆడే గోప్ప పండగ బతుకమ్మ అని..   దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు.

మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ తొలి సిఎం,  బి ఆర్ ఎస్ ప్రభుత్వం  బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించిందని రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు...ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ  బతుకమ్మ కానుకగా కెసిఆర్ గారు ఆడపడుచులకు చీరల పంపిణీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.