calender_icon.png 20 September, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక జ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకోవలి

20-09-2025 07:49:58 PM

ఆర్మూర్ (విజయక్రాంతి): క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ పై ప్రత్యేక గెస్ట్ లెక్చరర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గెస్ట్ లెక్చరర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక జ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్‌లో మంచి కెరీర్ అవకాశాలు పొందగలరని తెలిపారు. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ప్రో ప్ టి. కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకపాఠాలకే పరిమితమైపోకుండా, జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఈ నైపుణ్యాలు ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో, అలాగే ఉద్యోగావకాశాలను సృష్టించుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మన ఆలోచనలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరచగలగడం సాధ్యమవుతుందని, టీమ్ వర్క్ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొని, సహకార భావనతో కలిసి పనిచేయగలమని వివరించారు.

అలాగే, లీడర్‌షిప్ క్వాలిటీస్ ద్వారా సమస్యలను సానుకూల దృక్కోణంతో పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని, మంచి నాయకుడిగా ఎదగడానికి ఇవి పునాది వంటివని అన్నారు.అదేవిధంగా విద్యార్థులు తమ టైమ్ మేనేజ్‌మెంట్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి, మరియు ఇంటర్వ్యూలలో, కెరీర్ గ్రోత్‌లో విజయానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం తరగతి గదిలో నేర్చుకునే పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తరహా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు విద్యార్థులలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, ప్రాక్టికల్ నైపుణ్యాలను వెలికితీయడానికి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.

అలాగే విద్యార్థులు తమలోని టాలెంట్‌ను గుర్తించి, దానిని అభివృద్ధి చేసుకోవడానికి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే కంపిటీటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఉద్యోగాలు వంటి రంగాల్లో సక్సెస్ అవ్వాలంటే సాంకేతిక పరిజ్ఞానం టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా సమానంగా అవసరమని అన్నారు. అదేవిధంగా కళాశాల యాజమాన్యం విద్యార్థుల కోసం ఇలాంటి మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, వర్క్‌షాప్‌లు, గెస్ట్ లెక్చర్స్ నిర్వహించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. చివరగా, విద్యార్థులు ఈ అవకాశాలను సీరియస్‌గా తీసుకొని, తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలశాల సెక్రటరీ శ్రీ అల్జాపూర్ దేవేందర్, ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కట్కం శ్రీనివాస్, వివిధ విభాగ అధిపతులు బిఎస్&హెచ్ హెచ్ ఓ డి  స్వప్న ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డి ఆర్ వేద ప్రకాష్, సివిల్ హాడ్ రాజ్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ శృతిన్  పాల్గొన్నారు.