calender_icon.png 20 September, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో ఆవు మృతి

20-09-2025 07:46:38 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో రూ.50 వేల విలువైన ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన పాకాల జంగం లింగం ఆవును బావి వద్ద మేపుతున్న సమయంలో స్టార్టర్ డబ్బా కు ఆవు తగలడంతో ఆవు విద్యుదాగాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.