10-07-2025 12:17:34 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి) : సీజనల్ వ్యాధుల దృష్ట్య ప్రైవేటు వైద్య సంస్థలు పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ పార్శిగుట్ట వద్ద గల ప్రేయర్ పవర్ చర్చి లో చర్చి వ్యవస్థాపక సభ్యురాలు ఎస్తేర్ రాణి వర్ధంతి సందర్భంగా కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మె ల్యే ముఠా గోపాల్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ప్రజలు వివిద రకాల సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వైద్య సం స్థలు మానతవ దృక్పదంతో పేదలకు వైద్య సేవలను అందిం చాలని కోరారు. అందుకు కావల్సిన ఏర్పాట్లను సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అనంతరం ప్రేయర్ పవర్ చర్చ్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ క్రిష్టియన్ మైనార్టి కార్పొరేషన్ చైర్మన్ జాన్ దీపక్, ఆలిండియా ప్రేయర్ పవర్ చర్చి డైరెక్టర్ శ్యామ్ అబ్రహాం, కార్యదర్శి బ్రణహం, క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాల మూన్ రాజ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ,
తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, నగర కార్యదర్శి ఆర్. మోజేస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కెనడీ, డివిజన్ అధ్యక్షుడు అభిషేక్ కెనడి, మురళీ మోజేస్, రాజ్ప్, జై కుమార్, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.