calender_icon.png 10 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ వ్యాప్తంగా బంద్

10-07-2025 01:12:42 AM

  1. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల సమ్మె
  2. బంద్‌లో పాల్గొన్న 25 కోట్ల మంది కార్మికులు
  3. నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలని ఆందోళన
  4. సింగరేణిలో ఆగిన మైనింగ్.. రూ.76 కోట్ల నష్టం
  5. హైదరాబాద్‌లో రోడ్డెక్కిన కార్మిక సంఘాలు
  6. బ్యాంకింగ్, రవాణా సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ, జూలై 9: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక లోకం బుధవారం చేపట్టిన సమ్మెతో దేశం మొత్తం స్తంభించిపోయింది. కేంద్ర తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ దేశంలోని పదికి పైగా ప్రధాన కార్మిక సం ఘాలు, వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో చెదురు ముదరు సంఘటనలు మినహా అంతా సవ్యంగా సాగింది.

దేశ వ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెలో భాగమయ్యారు. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు తమ 17 డిమాండ్ల సాధ న కోసమే సమ్మె చేపట్టినట్టు కార్మిక సంఘా ల నేతలు తెలిపారు. కార్మికుల సమ్మెతో బ్యాంకింగ్, రవాణా, ఇతర ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగింది. మరోవైపు హైదరాబాద్‌లో భారత్ బంద్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సిబ్బంది రోడ్కెక్కారు.

కొత్త చట్టాలను రద్దు చేయాలని ఐఎన్‌టీయూసీ, సీఐటీ యూ, ఏఐటీయూసీ సంఘాలు డిమాండ్ చేశాయి. నగరంలో పలుచోట్ల కార్మికులు రహదారులను దిగ్భందించి ప్లకార్డులతో నిరసనలు నిర్వహించారు. ఇక భారత్ బంద్ కు సింగరేణి కార్మికులు మద్దతు తెలపడం తో గనుల్లో పనులు నిలిచిపోయాయి. కేకేన 5 గని దగ్గర ఐకే సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె వల్ల రూ.76 కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

ఈబంద్‌కు సంయుక్త కిషాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బ్యాంకిం గ్, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సమ్మెలో పాల్గొనడంతో ఆయా శాఖలపై బంద్ తీవ్ర ప్రభావం చూ పింది. బంద్ నేపథ్యంలో బ్యాంక్ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో పలు చోట్ల ఖాతాదారుల సేవలకు అంతరాయం ఏర్పడింది.

కేరళ, పశ్చిమ బెంగాల్‌లో బంద్ తీవ్రత

కార్మికులు చేపట్టిన భారత్ బంద్‌తో పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా స్తంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో డిటీసీ బస్సులు, మెట్రోపై ప్రభావం లేనప్పటికీ.. ప్రైవేటు రవాణా నిలిచిపోయింది. మహారాష్ట్రలో బంద్ కారణం గా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ బంద్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు.

రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్సులను అడ్డుకో వాలని చూసిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం భారీ గా బలగాలను మోహరించింది. బంద్ నేపథ్యంలో అక్కడి బస్సు డ్రైవర్లు హెల్మెట్ పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. కేరళ, ఒడిశాలోనూ బంద్ ప్రభావం గట్టిగా కనిపించింది. సూళ్లు, కళాశాలలు మూతపడ్డా యి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్మిక సంఘాలు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి పట్టా ల పైకి వెళ్లేందుకు యత్నించారు.

అయితే పోలీసులు వారిని నిర్భందించి అక్కడి నుం చి తరలించారు. కొన్ని చోట్ల రోడ్డు మార్గాలను అడ్డుకోవాలని చూడగా.. మరికొన్ని చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించా రు. కర్ణాటక, తమిళనాడు వ్యాప్తంగా బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. బెంగళూ రు, హుబ్లీ సహా కొన్ని ప్రాంతాల్లో కార్మికులు బంద్‌కు మద్దతుగా ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శణ నిర్వహించారు.

బీహార్‌లో రైల్వే ట్రాకులపైకి వచ్చి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఇక కేరళలోని కోయికోడ్, మలప్పురం, కన్నూర్, కాసర్‌గడ్‌లలో పూర్తిస్థాయిలో బంద్ జరిగింది. కాగా భారత్ బంద్‌కు పలు యూనియన్లు మద్దతు ఉపసంహరించుకున్నాయని కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్న వార్త లను ట్రేడ్ యూనియన్లు తోసిపుచ్చాయి. ఈ బంద్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆరోపించాయి.

కార్మిక సంఘాల డిమాండ్లు ..

* కనీస వేతనం 26వేలు ఉండాలి

* పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి

* ఈపీఎఫ్‌వో చందాదారులకు నెలనెలా రూ.9వేలు కనీస పింఛన్

* కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలి

హైదరాబాద్‌లో పాక్షికంగా

కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రభావం హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించింది. కొత్త చట్టాలను రద్దు చేయాలని ఐఎన్‌టీయూసీ, సీఐటీ యూ, ఏఐటీయూసీ సంఘాలు డిమాం డ్ చేశాయి. నగరంలో పలుచోట్ల కార్మికులు రహదారులను దిగ్భందించి ప్లకార్డులతో నిరసనలు నిర్వహించారు. నగరంలో స్కూళ్లు, కళాశాలలు యధావిథిగా నడవగా.. రవాణా కార్యకలాపా లకు కూడా ఎలాంటి అంతరాయం కలగలేదు.

బుధవారం దేశ వ్యాప్త కార్మికు ల సమ్మెలో భాగం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ, సర్వీస్ రంగ కార్మిక, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్‌ఐసీ తదితర కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. 

బంద్‌కు కారణాలివే..

* గత పదేళ్లుగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించకపోవడం

* కొత్త కార్మిక చట్టాల ద్వారా కార్మిక సంఘాలకు బలహీనపరిచే ప్రయత్నం

* పని గంటలను పెంచడం, కార్మికుల హక్కులను తగ్గించడం

* ప్రైవేటీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రోత్సహించడం

* నియామకాలు, మెరుగైన వేతనాల డిమాండ్లను విస్మరించడం

* యువత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఎంప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల కింద యజమానులకు ప్రయోజనాల ను అందించడం.