calender_icon.png 10 July, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగు దాటితేనే బడి!

10-07-2025 12:40:25 AM

* పూరి పాకలోనే విద్యార్థులకు చదువు

* కార్పొరేట్ వసతులు దేవుడెరుగు

* కనీస సౌకర్యాలు లేవు

చర్ల జూలై 9 (విజయ క్రాంతి); ప్రభుత్వాలు మారుతున్న.. అధికారులు హామీలు గొప్పిస్తున్న... కనీస మౌలిక సదుపాయాలు లేక సమస్యల నడుమ చదువులు సాగుతు న్న గ్రామాలు ఇంకా లేకపోలేదు. పక్కా భవ నం లేక, కనీస మౌలిక సదుపాయాల కు నోచుకోక, జోరు వానలో వణుకుతూ చదువుకోవాల్సిన దుస్థితి చర్ల మండలం కుర్నప ల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం గ్రామ విద్యార్థులకు తప్పడం లేదు. పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలు ప్రాణాలు తె గించి వాగు దాటి వచ్చే విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి నేటికీ కొనసాగుతోంది.

వివరా ల్లోకి వెళితే రామచంద్రపురం ప్రాథమిక పా ఠశాలలో 15 మంది విద్యార్థులు పూరిపాక లో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి యము నా అనే ఉపాధ్యాయురాలు విద్యను బోధిస్తున్నారు. దట్టమైన అడవి ప్రాంతమే కా కుండా, వాగు వంక దాటి గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మంగళవారం ఉ పాధ్యాయురాలు బయలుదేరిన సమయం లో జోరున వాన పడి వాగు పొంగి ప్రవహించడంతో మోకాళ్ళ లోతు నీటిలో దాటి రామచంద్రపురం చేరుకొని విద్యార్థులకు వి ద్యను బోధించారు. విషయం తెలుసుకున్న మండల విద్యా అధికారి రమణ అభినందించారు. 

పక్కా భవనం లేని ప్రాథమిక పాఠశాల 

రామచంద్రపురం ప్రాథమిక పాఠశాల నేటికీ పక్కా భవనం నోచుకోలేదు. పూరి పాకలోనే విద్య బోధన సాగుతోంది. గత ప్ర భుత్వం మన ఊరూ.. మనబడి, ప్రస్తుత ప్ర భుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే పథకాలు ప్రవేశపెట్టిన అధికారులకు రాంచం ద్రాపురం పాఠశాల కనిపించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి సారించి రామచంద్రపు రం ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

వాగుపై వంతెన నిర్మించాలి 

మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామం వెళ్లాలంటే బత్తినపల్లి అటవీ ప్రాం తం నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ రెండు గ్రామాల ప్రజలు అ నునిత్యం చర్ల మండలానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా వాగు దాటాల్సి వస్తుంది. వ ర్షాకాలం వచ్చిందంటే మూల ఆదివాసీలకు నిత్యవసరకులు లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాధులు సంక్రమించిన ప్రాణాలు తెగించి వాగు దాటా ల్సిందే. కుర్నపల్లి _రామచంద్రపురం గ్రామా ల మధ్య గల వాగుపై వంతెన నిర్మిస్తే తప్ప ఆ రెండు గ్రామాల ప్రజలకు రవాణా సౌ కర్యం మెరుగుపడదు. ప్రజా ప్రతినిధులు ఆ రెండు గ్రామాల ప్రజల సమస్యపై దృష్టి సా రించి వాగుపై వంతెన నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారు.