25-07-2025 12:00:00 AM
పటాన్ చెరు, జులై 24 : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఉన్న డంప్ యార్డు నుంచి భరించలేని దుర్గందపు వాసన వస్తుందని, దీంతో స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని బీజేపీ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కమిషనర్ కిషన్ కు తెలిపారు. ఈ మేరకు గురువారం సమస్య పరిష్కారం కోసం బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు.
కొన్ని సంవత్సరాలుగా డంప్ యార్డ్ సమస్యపై ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని డంప్ యార్డుకు చెత్తను తరలిస్తున్న వాహనాలను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అక్కడకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. సమస్యను కమిషనర్ కు వివరించిన ఆనంద్ కృష్ణారెడ్డి పరిష్కరించాలని కోరారు. త్వరగా సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. బీజేపీ నాయకులు, కాలనీ ప్రజలుపాల్గొన్నారు.