calender_icon.png 5 July, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయనిధి

05-07-2025 06:54:48 PM

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్ రావు..

హుజూర్ నగర్: ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్ రావు(Congress Party City President Tanniru Mallikarjuna Rao) అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన అందజేసి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను త్వరత్వరగతిన ప్రజా ప్రభుత్వంలో బాధిత కుటుంబాలకు అందిస్తున్నామన్నారు.

పట్టణంలోని మాధరాయినిగూడెం 28వ వార్డుకు చెందిన చింతల చెరువు లావణ్య, మంచాల శివకృష్ణ, మోదాల రజిత, చింతలచెరువు లింగయ్యలకు మంజూరైన రూ.2,52,500/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యుడు మోదాల వెంకన్న, వార్డు ఇంచార్జీ మోదాల సైదులు, నందిగామ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, మేకల సైదులు, సంజీవరావు, షేక్ అనీఫ్, తదితరులు పాల్గొన్నారు.