మిస్ ఇండియాకు సత్కారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): బెంగుళూరులో నిర్వహించిన 2024 మిస్ ఇండియా పోటీల లో విజేతగా నిలిచిన తెలుగు యువతి డాక్టర్ నిఖిత రాజ్‌ను జేఎంజీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లిఖిత రాజ్ మాట్లాడు తూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు. పోటీల్లో 29 రాష్ట్రాలవారు పాల్గొనగా.. డాన్సింగ్, ఇంటెలిజెన్సీ, టాలెంట్, సంస్కృతి, సాం ప్రదాయం, యోగ తదితర అన్ని విభాగా ల్లో ముందంజలో నిలిచినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో వైద్య రంగంలో సేవలందిస్తూనే ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. జేఎంజీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ జగన్నాథం మాదిరెడ్డి, రాచకొండ ఫార్ట్యూన్ ఇన్ఫ్రా డెవ లపర్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ దివ్య, శివకుమార్, వెంకటేష్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






