calender_icon.png 12 August, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన సేవలు అందించాలి

12-08-2025 12:00:00 AM

టీజీ ఎంపీడీసీఎల్ డైరెక్టర్

నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): విద్యు త్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని టీజీ ఎంపీడీసీఎల్ డైరెక్టర్ టి మధుసూదన్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పెన్షన్ల భవనంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల వారీగా సమీక్షించి న డైరెక్టర్ పనులను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

వ్యవసాయ కనెక్షన్లను త్వరగా మంజూరు చేయాలని లూస్ పోల్స్ ను సరిచేసి ప్రమాదవ జరగకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని మొబైల్ యాప్ లపై ఆన్లైన్ బిల్లులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి సలియా నాయక్ అధికారులు వెంకటేశ్వర్లు నాగరాజు విద్య శాఖ సిబ్బంది ఉన్నారు