calender_icon.png 31 July, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారులకు మెరుగైన సేవలు

30-07-2025 11:52:33 PM

విద్యుత్ ఎస్ఈ చంద్రమోహన్..

కొండపాక (విజయక్రాంతి): వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్(SE Chandramohan) తెలిపారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం కొండపాక మండలం దుద్దెడలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ ప్రజలతో పలు అంశాలపై మాట్లాడుతూ, ప్రజలకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నాడు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని,గ్రామంలో బీసీ కాలనీకి సపరేట్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని అలాగే గ్రామానికి ప్రత్యేకంగా ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని అలాగే కొన్ని ప్రాంతాలకు త్రీ ఫేస్ రావడం లేదని ఆ సమస్య తీర్చాలని కోరారు. దాంతో వాటన్నింటినీ పరిష్కరిస్తామని ఎస్ ఈ వారితో తెలిపారు. ఆయన వెంట విద్యుత్ శాఖ ఏఈ సత్యం, లైన్ ఇన్స్నపెక్టర్లు, జూనియర్ లైన్ మెన్ లు ఉన్నారు.