03-01-2026 12:39:53 AM
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): భద్రాచలం టు బాసర వరకు టెం పుల్ టూరిజం కార్యక్రమాన్ని చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురే ఖ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. మాస్ట ర్ ప్లాన్‌తో కొండగట్టు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, దేవాలయం విషయం లో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ ఇష్టానుసారంగా జీవోలను విడుదల చేసి, నిధులివ్వకుండా చేతులు దులుపుకుందన్నారు.
యాదాద్రిని పేరుకే గత ప్రభుత్వం నిర్మించిందని, కానీ తమ ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించిందన్నారు. సమ్మక్క దేవాలయాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్లుగా మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇద్దరు మహిళా మంత్రుల ఆధ్వ ర్యంలో ఆ అమ్మవార్లకు సేవ చేసే భాగ్యం వచ్చినందుకు గర్విస్తున్నానని మంత్రి తెలిపారు. చౌటుప్పల్ ప్రాంతంలో విజిబిలిటీ ఉంటేనే కొత్త కంపెనీల ఏర్పాటుకు అనుమతులిస్తున్నట్లు ఆమె మరో ప్రశ్నకు సమాధా నమిచ్చారు. ఏవైనా ఫార్మా కంపెనీలు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.