calender_icon.png 12 October, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు

11-10-2025 10:16:43 PM

ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని మండల రైతుల డిమాండ్..

మిడ్జిల్: అధిక వర్షాలతో పత్తి మొక్కజొన్న పంటలకు పూత లేకుండా పోయింది. దీంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం మొదలు రైతు బారసాదాకా కాంగ్రెస్ పాలనలో అన్నింటిలోనూ చేదు అనుభవాన్ని చవిచూసిన తెలంగాణ రైతంగానికి పంట నష్టపరిహారం ఓ కలగా మారింది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ మోతాదులో కురవడం వల్ల వేపుగా పెరిగినప్పటికీ పూత ఖాతా లేకుండా పోయింది. ఒకవైపు అధిక వర్షాలు మరోవైపు యూరియా కొరతతో రైతులు నట్టేట మునిగిపోయారు. ఆరుకాలం శ్రమించిన రైతులకు నిరాశ మిగిలే అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడులు సైతం వెళ్లే అవకాశం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.