calender_icon.png 12 October, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లు..

11-10-2025 10:33:53 PM

సింగరేణి నేలపై అంత‌రించిన‌ స్టెగోడాన్ ఏనుగు అవశేషాలు

పెద్దపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామ‌గుండం ఏరియా-1లోని మేడిపల్లి ఉపరితల గనిలో స్టెగోడాన్ జాతి ఏనుగు దవడ, దంతాలు బ‌య‌ట‌ప‌డింది. ఈ నేల‌లో నిక్షిప్త‌మైన ల‌క్షల ఏళ్ల‌ చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ స్టెగోడాన్ జాతి ఏనుగులకు ఒక విశేషమైన లక్షణం, వాటి దంతాలు సుమారు 10 అడుగుల పొడవు వరకు ఉంటాయి. అంటే ఒక బస్సు పొడవులో మూడో వంతు! వాటి ఎత్తు సుమారు 13 అడుగులు, బరువు 12.5 టన్నులు వరకు ఉండేది. ప్రకృతి, చరిత్ర, విజ్ఞానం కలిసిన సింగరేణి నేల భారత వారసత్వానికి మరో గర్వకారణం! భూమి పొరల్లో నిక్షిప్తమైన నల్ల బంగారంతో వెలుగులు పంచడమే కాకుండా, భూగర్భ చరిత్రను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచే గొప్ప బాధ్యతను సింగరేణి నిర్వర్తిస్తున్నది.