11-10-2025 10:40:24 PM
నవాబ్ పేట: ఎర్రవడుక తండా, వెంకటేశ్వర తండా గ్రామానికి చెందిన విశ్లావత్ పాండు(45) అనే వ్యక్తి తండా సమీపంలో వీరాపురం మల్లయ్య పొలంలో చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నడని అతని భార్య విశ్లావత్ మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం షాద్ నగర్ వెళ్ళి అక్కడే ఉంటూ మేస్త్రి పని చేస్తుండేవాడు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 3 గంటలకు పనిమీద బయటకు వెళ్లి వాస్తనాని షాద్ నగర్ నుంచి బయలుదేరాడు. శనివారం ఉదయం వీరాపురం మల్లయ్య పొలంలో చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని చనిపోయిన విశ్లావత్ పాండును చూసి తండా వాసి గోపాల్ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని భార్య విశ్లావత్ మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.