11-10-2025 10:43:27 PM
ఆదివాసీలకు ఎర్రజెండానే అండ..
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
లక్ష్మీదేవిపల్లి/భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలం ఉమ్మడి బంగారుచెలక జిపి పరిధిలోని లక్ష్మి పురం గ్రామపంచాయతీ పరిధిలోని పలుగ్రామాల నుంచి 40 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. ఆర్లగండి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీపురం పంచాయతి మాజీ సర్పంచ్ వర్ష వసంత్, మాజీ ఉప సర్పంచి బాడిశ మోహనరావు, గ్రామపెద్దలు శంకర్, తాటి రాంబాబు, గోపాల్, సూర్య ప్రకాష్, నరేష్ తదితరులకు ఎర్ర కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీలో నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలకు సిపిఐలో అండ అని, వారికి అండగా నిలబడి సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తుంది ఎర్ర జెండానేని అన్నారు.
సిపిఐ పట్టణాలకే పరిమితమై ఉండదని, పేదలు ఏ మారుమూల నివసించిన వారి సంక్షేమ భాధ్యతను సిపిఐ మోస్తుందన్నారు. పేదకుటుంబాల సంక్షంకోసమే సిపిఐ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ గ్రామాలపై ప్రేత్యేక ద్రుష్టి సారించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, గత నాయకులు మారుమూల పల్లెలను పట్టించుకోకుండా మొకం చాటేసిన పరిస్థితులను గుర్తించిన ఏజెన్సీ ప్రజలు సిపిఐవైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, మండల నాయకులు దార శ్రీనివాసరావు, కంటెం సత్యనారాయణ, జోగా రామయ్య, పారిపర్తి రాజు, జోగ రాజబాబు, రామస్వామి, పుల్లయ్య, కార్తీక్, నవీన్, మోహన్ ముత్తయ్య, రాజు, చంద్రం తదితరులు పాల్గొన్నారు.