calender_icon.png 12 October, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతరత్న జయప్రకాశ్ నారాయణ జయంతి

12-10-2025 01:57:44 AM

హాజరైన రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): లోక్ నాయక్ భారతరత్న జయప్రకాశ్ నారాయణ 123వ జయంతిని స్థానిక జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరుపుకున్నా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ డాక్టర్ వీ బాలకిష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ విగ్రహానికి, ఆడిటోరియంలో జయప్ర కాశ్ నారాయణ చిత్రప టానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

ఈ సంద ర్భంగా బాలకిస్టరెడ్డి ప్రసం గిస్తూ.. “లోక్ నాయక్ భారత రత్న జయప్రకాశ్ నారాయణ జన్మదినం పురస్కరిం చుకొని కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారకు. ఆన్‌లైన్ అసిస్మెంట్ కొరకు కంప్యూ టర్ ల్యాబ్‌ను ముఖ్య అతిథి ప్రారంభించారు. టీఓఆఎఫ్‌ఎల్, జీఆర్‌ఈ లాంటి ఐఈఎల్‌టీఎస్ లాంటి అంతర్జాతీయ పోటీ పరీక్షలు ఇక్కడ నిర్వహించబడతాయి.

భారత దేశం సాంకేతిక రంగం లో ముందడుగు వేసి  అద్భుతాలు చేస్తుందని తెలి పారు. 2047వ సంవత్సరం లోపల భారత దేశం అభివృద్ధి చెందుతుందని మీరు అందులో భాగస్వామ్యం కావాలని కోరారు. ముఖ్యమంత్రి కూడా విద్య రంగాన్ని అభివృద్ది చేయుటకు కృషి చేస్తున్నారని చెప్పా రు. కళాశాల చైర్మన్ చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. జయప్రకాశ్ నారా యణ్ ఒక గొప్ప రాజకీయవేత్త అని, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకుని భారత దేశం లో సర్వోదయ ఉద్యమం, భూదాన్ ఉద్యమంలో పాల్గొన్నాడని తెలిపారు.

జీవితములో ఎలాంటి పదవులు ఆశించకుండా లోక్ సేవక్ గా ఉండి లోక్ నాయక్ గా గుర్తింపు పొందాడని తెలిపారు. 1977 వ సంవత్సరంలో ఎమర్జెన్సీ విధించినపుడు సంపూర్ణ క్రాంతి విప్లవం అనే నినాదంతో ఉద్యమం చేశాడని తెలిపారు. కళాశాల సెప్టెంబర్  నెలకు సంబంధించి న్యూస్ లెటర్ ఆవిష్కరించారు. అలాగే ఈ విద్య సంవత్సరములో ఇంజనీరింగ్ విభాగంలో 500 మంది చేరిన సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషము వ్యక్త పరిచారు.

దానితో పాటు కళాశాలకు చెంది న ప్రొఫెసర్ సాయికృష్ణకు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వీ వెంకటరామరావు, ప్రిన్సిపాల్ డా. పీ కృష్ణమూర్తి, పాలి టెక్నిక్ ప్రిన్సిపాల్ డా వీఈ చంద్రశేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి కోటల సందీప్ కుమార్, పాలమూరు బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి బాలయ్య, ఆన్‌లైన్ అసిస్మెంట్ ఇంచార్జి అజయ్‌కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాప కులు, విద్యార్థులు 85 మంది విద్యార్థులు రక్తదానం చేశారు.