12-10-2025 01:56:26 AM
సోమాలియా యువకుడికి కొత్త జీవితం అందించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సోమాలియాకి చెందిన 20 ఏళ్ల యువకుడికి అక్కడ జరిగిన ఒక దుర్ఘటనలో, అతడి శరీరంలోకి దూసుకెళ్లిన గన్‌షా ట్ వల్ల రెండు మూత్రనాళాలను (యూరెటర్లను) చీల్చి, మూత్రాశయాన్ని దెబ్బతీసింది. ప్రాణాపాయం నుంచి బయటపడినా, అత జీవితం నెఫ్రోస్టమీ ట్యూబ్స్ అంటే మూత్రపిండాల నుంచి మూత్రం నేరుగా బయటకు వచ్చే ట్యూబ్స్ మూసుకుపోయాయి.
సాధారణంగా బతకడం అసాధ్యమనుకున్న స్థితి అది. మొదట ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలలో చూయించిన అక్కడ డాక్టర్స్ ఎవ రు కూడా చేయలేకపోయారు. హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్స ల్టెంట్ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్ డా ఏ.వి. రవికుమార్‌ను యువకుడు ఆశ్రయించాడు. స్పెషల్ స్కాన్లలో రెండు కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, వాటి నుంచి మూ త్రాశయానికి వెళ్లే మార్గం పూర్తిగా బ్లాక్ అయినట్లు డాక్టర్లు కనుగొన్నారు. అతను మళ్లీ సాధారణ జీవితం గడపాలంటే, దెబ్బతిన్న ఆ మార్గాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గం.
దానికి ప్రేగు భాగంతో కొత్త జీవన మార్గం ద్వారా దాన్ని సరిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సీనియర్ కన్స ల్టెంట్ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్ డా. ఏ.వి. రవికుమార్ నేతృత్వంలోని బృందం రెండు మూత్రనాళాలను ఒకేసారి పునర్నిర్మించడం అనేది యూరాలజీలో అరుదైన, సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన సవాలు. ఈ సవాలును అధిగమించడానికి వైద్యులు అత్యాధునిక రోబోట్ -అసిస్టెడ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ నిర్వహించారు.
సుమారు 25 సెంటీమీటర్ల చిన్న పేగు భాగాన్ని సేకరించి, దాన్ని జాగ్రత్తగా మలిచి, కిడ్నీలకు, మూత్రాశయానికి మధ్య ఒక కొత్త, సహజమైన మూత్ర ప్రవాహమార్గాన్ని సృష్టించారు. గంటల తరబడి జరిగిన ఈ శస్త్రచికిత్స మొత్తం శరీరంపై పెద్ద కోత లేకుండా, కేవలం చిన్న రంధ్రాల ద్వారానే రోబోటిక్ చేతుల సహాయంతో పూర్తుంది. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, రోగి జీవితం మళ్లీ ఆశతో చిగు రించింది.
డా. రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘సాధారణంగా ఇంత పెద్ద గాయాల తర్వాత కిడ్నీలను రక్షించడం, అది కూడా రెండు మూత్రనాళాలను పునరుద్ధరించడం కష్టం. కానీ రోబోటిక్ సర్జరీ ఖచ్చితత్వంతో, తక్కువ రక్తస్రావం మరియు వేగవంతమైన కోలుకోవడంతో ఈ అద్భుతాన్ని సాధించగలిగాము,‘ అని తెలిపారు.