calender_icon.png 12 July, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కైలాష్ మానసరోవర యాత్రకు పాల్వంచ వాసి పీవీకే ఉపేందర్

16-06-2025 01:59:25 AM

నేడే యాత్ర ప్రారంభం 

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 15 (విజయ క్రాంతి); కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కైలాష్ మానసరోవర యాత్ర లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ నికి చెందిన పీవీకే ఉపేందర్ ఎంపికయ్యారు. ఐదు సంవత్సరాల తర్వాత ఆదివారం నుంచి ఈ యాత్ర ప్రారంభం మైంది. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా సుమారు 6000 మంది ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో డిజిటల్ లాటరీ పద్ధతి ద్వారా 720 మందిని ఎంపిక చేశారు. వీరిని 15 బృందాలుగా విభజించారు.

10 బృందాలు సిక్కిం లోని నదూలా కనుమ మీదుగా, మిగిలిన ఐదు బృందాలు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ కనుమ ద్వారా ప్రయాణం చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కటోరమైన ఆరోగ్య పరీక్షల అనంతరం ప్రయాణానికి అనుమతించారు. ప్రతి బృందంలో 48 మంది యాత్రికులు, ఇద్దరు అనుసంధాన అధికారులు ఉంటారు. మొదటి బృందాన్ని న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల, టెక్స్టైల్స్ సహాయ మంత్రి పబిత్ర మార్గహరిట జండా ఊపి ప్రారంభించారు. నేడు ప్రారంభమైన బృందం జులై 2న తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.

ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కైలాస కొండను సందర్శించుకొని, మానసరోవరంలో పవిత్ర స్నానం చేయుట హిందువులకు చిరకాల కోరిక. ఈ యాత్రలో హిందువులతో పాటు బౌద్ధులు జైనులు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మాన సరోవర యాత్రకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పీవీకే ఉపేందర్ ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం . ఈ సందర్భంగా ఆయన విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ యాత్రలో పాల్గొనడం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుందని, పరమ శివుడి ఆశీస్సులతోనే ఈ అవకాశం లభించిందని తెలిపారు.