20 March, 2026 | 7:24 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

Telangana Budget 2026-27: దేశానికి తెలంగాణ గ్రోత్ ఇంజిన్

20-03-2026 01:14 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు. రీజనల్ రింగ్ రోడ్డు అవతల అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని పేర్కొన్నారు. పరిపాలన అభివృద్ధి కోసం 3 కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్ ను విభజన చేశామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీల జాబితాలో చేరనుందన్నారు. హైదరాబాద్ లో 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ కొత్త భవిష్యత్తుకు కేంద్రంగా మారబోతుందన్నారు. అంతర్జాతీయ నైపుణ్యాలు కలిగిన కార్మికుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. 

గత ప్రభుత్వం టీజీపీఎస్సీ నవ్వుల పాలైందన్న భట్టి విక్రమార్క ఇప్పటి వరకు 67 వేల మందికి నియామక పత్రాలు అందించామని చెప్పారు. సివిల్స్ రాసే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించామన్నారు. 202 మందికి సింగరేణి సంస్థ ఒక్కక్కరికి రూ, లక్ష అందిచ్చిందన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University ) స్థాయిలోవిద్యనందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో సీఎం, మంత్రులు విదేశీ పర్యటనలు చేశారని పేర్కొన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7 శాతం ఎక్కువన్నారు.  దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.

దేశ తలసరి ఆదాయం తో పోలిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువన్నారు. 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్షమన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించారు. వచ్చిన నిధులు ఇతర రంగాలకు మళ్లించారు.. ఫలితంగా కొన్ని నిధులు నిలిచిపోయాయని తెలిపారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి అందిస్తోందన్నారు. అందులో మనకు వచ్చేది 42 పైసలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ను దేశానికి భవిష్యత్ ఆర్థిక శక్తిగా మారుస్తామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సమ్మిట్ నిర్వహించామని సూచించారు. క్యూర్, ఫ్యూర్, రేర్ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నామని చెప్పారు. హైదరాబాద్ సహా విదేశాల్లో ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు. మా విధానాలతో లక్ష మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. రానున్న రోజుల్లో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతుంది, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.