Telangana Budget 2026-27: ఏ శాఖకు ఎంత..? కేటాయింపుల వివరాలు
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో 2026–27 తెలంగాణ బడ్జెట్‌ను(Telangana Budget 2026-27) ప్రవేశపెట్టారు. దీని మొత్తం కేటాయింపు రూ. 3,24,234 కోట్లు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నాలుగవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన 2026-27 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దీనికి ముందు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం, బడ్జెట్‌కు ఆమోదం తెలిపి, దానిని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు పంపింది.
రూ. 3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 34 వేల 406 కోట్లు
మూలధన వ్యయం రూ. 47 వేల 267 కోట్లు
తలసరి ఆదాయం రూ. 4 లక్షల 18 వేల 931
తెలంగాణ వృద్ధి రేటు 10.2 శాతం
తెలంగాణ బడ్జెట్ 2026-27.. కేటాయింపులు ఇలా
వ్యవసాయం, రైతు సంక్షేమం రూ. 23 వేల 179 కోట్లు
పౌరసరఫరాల శాఖ రూ. 7 వేల 366 కోట్లు
పశుసంవర్ధక, మత్సశాఖకు రూ. 1529 కోట్లు
రైతు భరోసా- రూ. 18 వేల కోట్లు
చేయూత రూ. 14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు- రూ. 5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం రూ. 4,305 కోట్లు
వడ్ల జోనస్ రూ. 3,500 కోట్లు
గృహజ్యోతి - రూ. 2080 కోట్లు
విద్యుత్ శాఖకు రూ. 21 వేల 285 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 13 వేల 679 కోట్లు
విద్యుత్ సబ్సిడీ - రూ. 14 వేల కోట్లు
కార్మిక సంక్షేమశాఖ రూ 998 కోట్లు
ఆరుగ్యారంటీలకు రూ. 50 వేల 713 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ రూ. 3 వేల 113 కోట్లు
బియ్యం సబ్సిడీ రూ. 3 వేల కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్- రూ. 3,683 కోట్లు
విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ 2,170 కోట్లు
స్కాలర్ షిఫ్ లు రూ. 4343
ఎస్ డీఎఫ్ రూ. 3,300 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 11 వేల 784 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 7 వేల 937 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 12 వేల 511 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 3 వేల 769 కోట్లు
రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6 వేల కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 7 వేల 430 కోట్లు
ఆరోగ్య శ్రీ రూ. 1143 కోట్లు
ఎల్పీజీ సబ్సిడీ రూ. 723 కోట్లు.




