01-08-2025 08:19:11 PM
అర్హులు అందరు దరఖాస్తు చేసుకోవాలన్న తుంగతుర్తి రవి..
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి(Congress Party President Thungathurthy Ravi) మాట్లాడుతూ, ఇల్లు లేని పేదలు ఎవరైన ఉంటే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి పేదవారికి అందాలని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రేఖ, విష్ణుపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అమర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.