calender_icon.png 7 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించాలి

06-08-2025 10:59:10 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి)ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. బుధవారం ఆమె మాన్యం చెల్క పట్టణ  వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ఓపి, ఏఎన్సి, మందుల స్టాక్  రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే టెస్టులు, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయా చికిత్సలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల జబ్బులు, చికిత్స, రెఫరల్ వివరాలు అడిగారు. అనంతరం పక్కనే నిర్మిస్తున్న మాన్యం చెల్క యు పి హెచ్ సి నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించి భవన నిర్మాణం పనులు పూర్తయినందున ఇతర పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పుర కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, ఇతరులు ఉన్నారు.